Andhra Pradesh: పీఏసీ చైర్మన్ పదవిని చాలామంది ఆశించారు.. కానీ చంద్రబాబు బంధుప్రీతిని చాటుకున్నారు!: విజయసాయిరెడ్డి

  • ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదు
  • కాపులు, బీసీలను ఆయన అస్సలు నమ్మరు
  • అందుకే బంధువైన పయ్యావులకు పదవి ఇచ్చారు

టీడీపీ అధినేత చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కాపులు, బలహీనవర్గాలను ఆయన విశ్వసించరని దుయ్యబట్టారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని టీడీపీలో చాలామంది నేతలు ఆశించారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. అయితే ఈ పదవిని చివరికి పయ్యావుల కేశవ్ కు ఇచ్చిన చంద్రబాబు తన బంధుప్రీతిని చాటుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News