Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణ!

  • అగ్రవర్ణ పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు
  • ఇది ఇంకా ఏపీలో అమలు కావడం లేదు
  • అమలయ్యేలా సీఎం చర్యలు తీసుకోవాలి

ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణాల పేదలకు తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కానీ ఇది ఏపీలో ఇంకా అమలు కావడం లేదన్నారు. దీనివల్ల చాలామంది యువత అవకాశాలు కోల్పోతున్నారనీ, తద్వారా నిరాశకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని కన్నా డిమాండ్ చేశారు. ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ చట్టం అమలు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు.

Andhra Pradesh
Chief Minister
Jagan
YSRCP
kanna lakshmi narayana
BJP
Twitter
open letter
  • Loading...

More Telugu News