Rohit Sharma: అనుష్కను అన్ ఫాలో అయిన రోహిత్ శర్మ... కోహ్లీతో విభేదాలు బట్టబయలు?

  • రోహిత్, కోహ్లీ మధ్య ఇన్ స్టాగ్రామ్ వార్
  • రోహిత్, రితికలను అన్ ఫాలో చేసిన అనుష్క
  • ఇద్దరి మధ్యా గొడవలని వార్తలు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య పొసగడం లేదని, డ్రస్సింగ్ రూమ్ లో గొడవలు జరుగుతున్నాయని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దలు ఖండించినా, సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తుంటే, ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయనే అంటున్నారు నెటిజన్లు.

కొన్నాళ్ల క్రితం విరాట్ కోహ్లీని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిన రోహిత్, ఇప్పుడు ఆయన భార్య అనుష్క శర్మను కూడా అన్ ఫాలో అయ్యాడు. ఇక ఇదే సమయంలో అనుష్క శర్మ రోహిత్, అతని భార్య రితికల ఖాతాలను ఫాలో కావడం ఆపేసింది. తనను, తన భర్తను ఫాలో కాని వ్యక్తులను తానెందుకు ఫాలో కావాలని అనుష్క భావించినట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరి నుంచి చూస్తున్న నెటిజన్లు, కోహ్లీ, రోహిత్ ల మధ్య గొడవలు చాలా ఎక్కువగానే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. బ్రిటన్ లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో సెమీస్ ముందు వరకూ ఈ ఇద్దరి మధ్యా సఖ్యత ఉన్నట్టు కనిపించినా, సెమీస్ లో ఓటమి తరువాత విభేదాలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో వెస్టిండీస్ టూర్ కు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని తొలుత కోహ్లీ భావించగా, ఆపై కెప్టెన్సీని ఎక్కడ రోహిత్ శర్మకు అప్పగిస్తారోనన్న ఆందోళనతో టూర్ కు సిద్ధమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. ఏమైనా, తమిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటన్నది ఇంతవరకూ అటు కోహ్లీగానీ, ఇటు రోహిత్ గానీ బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు.

Rohit Sharma
Virat Kohli
Anushka Sharma
Instagram
  • Loading...

More Telugu News