Telangana: గాంధీ ఆసుపత్రిలో ‘టిక్ టాక్’ వైరస్.. రోగులను వదిలేసి ఎంజాయ్ చేస్తున్న వైద్యులు!

  • హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఘటన
  • విచారణకు ఆదేశించిన హాస్పిటల్ యాజమాన్యం
  • వైద్యులపై  దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఇటీవల ఖమ్మం మున్సిపల్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోగం గాంధీ ఆసుపత్రి సిబ్బందికి సోకింది. గాంధీ ఆసుపత్రికి రోజుకు వందలాది రోగులు వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో రోగులను పట్టించుకోని ఫిజియోథెరపి విభాగానికి చెందిన డాక్టర్లు, సిబ్బంది టిక్ టాక్ యాప్ లో వీడియోలు తీసుకున్నారు.

అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ కాగా, ఆసుపత్రి యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. మరోవైపు వైద్యులు పనిమానేసి ఈ వీడియోలు చేయడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Telangana
Hyderabad
gandhi hospital
Tik tok
Viral Videos
enquiry
doctors enjoy
  • Error fetching data: Network response was not ok

More Telugu News