Telangana: ఆదిలాబాద్ లో 'కరెంట్' ఫ్యామిలీ.. ఆ ఇంట్లో వాళ్లు తాకగానే వెలుగుతున్న బల్బులు!

  • ఇటీవల బల్బులు కొన్న చాంద్ బాషా
  • పిల్లలు తాకగానే వెలిగిన బల్బులు
  • చాంద్ బాషా శరీరంలోనూ ప్రవహిస్తున్న విద్యుత్

సాధారణంగా బల్బులు వెలగాలంటే బ్యాటరీలు లేదా విద్యుత్ కావాలి. అసలు కరెంటే లేకుండా మనుషులు తాకగానే లైట్లు వెలిగితే? వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇలాంటి ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరసన్న రామ్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ బాషా ఇటీవల బల్బు కొని తీసుకొచ్చాడు. అయితే పిల్లలు ఈ బల్బును చేతితో పట్టుకోగానే వెలిగింది.

దీంతో చాంద్ బాషా దాన్ని చేతిలోకి తీసుకోగా వెలుగుతూనే ఉంది. చాంద్ బాషాతో పాటు అతని కుమారుడు, కుమార్తెలు తాకితే బల్బు వెలుగుతోంది. దీంతో ఈ విషయం ఆనోటా, ఈనోటా ఊరంతా పాకిపోయింది. దీంతో ఈ కుటుంబం ఊరిలో చిన్నస్థాయి సెలబ్రిటీ  ఫ్యామిలీగా మారిపోయింది. అయితే ఓ బల్బును వెలిగించే స్థాయిలో వీరి శరీరంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News