Andhra Pradesh: సింహాచలంలో పంచగ్రామాల సమస్య.. ప్రత్యేక కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం!

  • చైర్మన్ మంత్రి వెల్లంపల్లి
  • సభ్యులుగా అవంతి, అజయ్ కల్లం, ఎమ్మెల్యే శ్రీనివాస్
  • జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం

సింహాచలం అప్పన్న దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం సలహా కమిటీని నియమించింది. ఈ సలహా కమిటీ చైర్మన్ గా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సభ్యులుగా మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజ్, సీఎం సలహాదారు అజయ్ కల్లం, విశాఖ కలెక్టర్ వ్యవహరిస్తారు. అలాగే సింహాచలం ఆలయ ఈవో మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Andhra Pradesh
vellam palli
pancha gramalu
problem
committee
  • Loading...

More Telugu News