Andhra Pradesh: ఏపీలో 33 లక్షల రైతు కుటుంబాలు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి!: టీడీపీ నేతలు
- మిగిలిన రూ.8 వేల కోట్లు వెంటనే చెల్లించండి
- దీనివల్ల విత్తనకొరత నుంచి ఊరట లభిస్తుంది
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేతలు
టీడీపీ హయాంలో రూ.24,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, తమ ప్రభుత్వం రూ.16,000 కోట్లు మాఫీ చేసిందని టీడీపీ నేతలు చినరాజప్ప, సాంబశివరావు తెలిపారు. మిగిలిన 4,5 విడతల చెల్లింపుల కింద రూ.8,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ నగదును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు.
ఏపీలో 33 లక్షల మంది రైతు కుటుంబాలు మిగిలిన రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయని టీడీపీ నేతలు అన్నారు. విత్తనాల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు రూ.8,000 కోట్లు విడుదల చేస్తే కొంత ఊరట కలుగుతుందని అభిప్రాయపడ్డారు.