Kidnap: హయత్ నగర్ అమ్మాయిని అపహరించింది విజయవాడ పాత నేరస్తుడని గుర్తించిన పోలీసులు!

  • ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
  • తండ్రి, సోదరుడిని మోసం చేసి యువతి అపహరణ
  • నిందితుడిని పట్టుకుంటామంటున్న పోలీసులు

హైదరాబాద్ శివారు హయత్ నగర్ ప్రాంతంలో, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ తండ్రిని, అతని కుమారుడు, కుమార్తె సోనీలను కారులో ఎక్కించుకుని నగరమంతా తిప్పి, ఆపై తండ్రీ కొడుకులను మాయపుచ్చి, యువతిని అపహరించుకు వెళ్లిన వ్యక్తి, విజయవాడకు చెందిన పాత నేరస్తుడని పోలీసులు గుర్తించారు. సదరు నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి, సోనీని తీసుకెళ్లాడని వెల్లడించారు. అతని ఆచూకీ కోసం ఐదు టీమ్ లు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ వెల్లడించారు.

హయత్‌ నగర్‌ సీఐ సతీష్‌ టీమ్ విజయవాడ వైపు, వనస్థలిపురం డీఐ జగన్నాథ్‌ బృందం ఒంగోలు మార్గంలో వెళ్లారని, మరో టీమ్ ను బళ్లారి వైపు పంపించామని, ఇంకో టీమ్ ఓఆర్‌ఆర్‌ టోల్‌ ప్లాజా పరిసరాలలో, మరో టీమ్, సీసీటీవీ పుటేజ్‌ లను పరిశీలిస్తుందని తెలిపారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. కాగా, తన బిడ్డ ఆచూకీని ఎలాగైనా కనుగొనాలని పోలీస్ స్టేషన్ ఎదుట సోనీ తండ్రి యాదగిరి బోరున విలపించాడు.

Kidnap
Sony
Hyderabad
Police
  • Loading...

More Telugu News