East Godavari District: కిడ్నాపర్ల డిమాండ్లకు జషిత్ తండ్రి అంగీకరించారంటూ ప్రచారం.. ఖండించిన వెంకటరమణ!

  • బెట్టింగ్ లలో మునిగితేలే వెంకటరమణ
  • కిడ్నాపర్ల రహస్య డిమాండ్లకు తలొగ్గిన జషిత్ తండ్రి
  • విచారణలో తేలుతుందన్న వెంకటరమణ 

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ నకు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్, క్షేమంగా ఇంటికి చేరుకోగా, కిడ్నాపర్లు కొన్ని రహస్య డిమాండ్లు చేశారని, వాటికి బాలుడి తండ్రి వెంకటరమణ అంగీకరించడంతోనే విడిచి పెట్టారని వార్తలు వస్తున్నాయి. వెంకటరమణ క్రికెట్ బెట్టింగ్ లో మునిగి తేలుతుండేవాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి.

బెట్టింగ్ గొడవల కారణంగానే బాలుడి కిడ్నాప్ జరిగివుండవచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతుండగా, తనపై వచ్చిన ఆరోపణలను వెంకటరమణ ఖండించారు. తాను మామూలు క్రికెట్ ఆటగాడినే తప్ప, బెట్టింగ్‌ లతో సంబంధం లేదన్నారు. కిడ్నాపర్లకు తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేస్తూ, జషిత్ ను ఎవరు, ఎందుకు కిడ్నాప్‌ చేశారో తెలియదని, పోలీసుల విచారణలో ఆ విషయం తేలుతుందని అన్నారు. తన ఆస్తిలో కొంత బదలాయించడం వల్లే బిడ్డను వదిలారని అనడం నిజం కాదని చెప్పారు.

East Godavari District
Jashit
Kidnap
Venkataramana
  • Loading...

More Telugu News