Andhra Pradesh: వైసీపీకి నాపై చాలా అభిమానం ఉన్నట్లుంది.. నాకే ఆశ్చర్యం వేస్తోంది!: చంద్రబాబు వ్యంగ్యం

  • ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన టీడీపీ అధినేత
  • పయ్యావుల తర్వాత ఆయనకు అవకాశమిచ్చిన స్పీకర్
  • వైసీపీ ప్రభుత్వంలో మార్చు వచ్చిందన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మాటలతో సభలో నవ్వులు పూయించారు. నదీ జలాల పంపకంపై చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తొలుత మాట్లాడారు. తెలంగాణ భూభాగంలో నదీ జలాలను మళ్లిస్తే మన జుట్టు తెలంగాణ చేతిలో పెట్టినట్లేనని హెచ్చరించారు.

అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో చంద్రబాబు తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. చూస్తుంటే వైసీపీకి తనపై చాలా అభిమానం ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. అంత అభిమానం చూసి తనకే ఆశ్చర్యం వేస్తోందని చెప్పారు. చాలా మార్పు వచ్చిందనీ, దీనిపై చాలా సంతోషంగా ఉందని వ్యంగ్యంగా స్పందించారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ సహా సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Andhra Pradesh
YSRCP
Chandrababu
funny comments
  • Loading...

More Telugu News