Andhra Pradesh: అప్పట్లో టీడీపీ మంత్రులు జగన్ ను తిడుతుంటే చంద్రబాబు చప్పట్లు కొట్టారు.. ఇప్పుడు మేం కూడా అదే చేస్తున్నాం!: కోటంరెడ్డి

  • చంద్రబాబు నేర్పిన విద్యనే ప్రదర్శిస్తున్నాం
  • ముందు చంద్రబాబు క్షమాపణలు చెబితే నేనూ చెబుతా
  • ఆడియో టేపులు ఫోరెన్సిక్ కు పంపేందుకు సిద్ధమా?

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు చప్పట్లు కొట్టారని చెప్పారు. సభలో చంద్రబాబు నేర్పిన విద్యనే తాము ప్రదర్శిస్తున్నామని వ్యాఖ్యానించారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెబితే.. ఖబడ్దార్ అనే మాటలకు తాను క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు.

తనకు సంబంధం లేని ఆడియో టేపులు తనవని టీడీపీ ఆరోపిస్తోందని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనవి అని చెబుతున్న ఆడియో టేపులను, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ పరీక్షకు పంపేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఆ టేపులో మాట్లాడింది తానేనని తేలితే ఎలాంటి శిక్షనైనా అనుభవించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ విషయంలో శిక్ష అనుభవించడానికి చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
Chandrababu
kotamreddy sridhar reddy
Chief Minister
MLA
  • Loading...

More Telugu News