Andhra Pradesh: యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కాకముందే నేను కాంట్రాక్టర్ గా ఉన్నా!: టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్

  • పోలవరంలో అవినీతి జరగలేదు
  • వైసీపీ నేతలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలు
  • కడపలో మీడియాతో టీడీపీ నేత

పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి చోటుచేసుకుందనీ, ఈ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ నేత యనమల వియ్యంకుడు(పుట్టా సుధాకర్ యాదవ్) కాంట్రాక్టర్ గా ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గతంలో ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలను పుట్టా సుధాకర్ యాదవ్ ఖండించారు. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. కడప జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.

తమ కంపెనీకి అప్పనంగా కోట్లు అప్పగించేశారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని సుధాకర్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టులోని ఐదో ప్యాకేజీలో భాగంగా తమ కంపెనీకి రూ.181 కోట్ల విలువైన పనులు అప్పగించారని వెల్లడించారు. చేసిన పనులకు గానూ గత మూడేళ్లలో రూ.111 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు.

 యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కాకముందు నుంచే తాను కాంట్రాక్టులు చేస్తున్నానని చెప్పారు. తాము ఈ ప్రాజెక్టు పనుల్లో 500 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పునరుద్ఘాటించారు.

Andhra Pradesh
Telugudesam
Yanamala
YSRCP
Jagan
Polavaram project
Corruption
  • Loading...

More Telugu News