rachamallu sivaprasadreddy: చంద్రబాబు మమ్మల్ని కష్టపెట్టాడు...జగన్‌ దళంగా ఏర్పడి పోరాడాం: ఎమ్మెల్యే రాచమల్లు

  • మళ్లీ ఆయన సీఎం కాకూడదని పంతంతో పనిచేశాం
  • అప్పుడు పోరాడాం...ఇప్పుడు పాలనలో దక్షత చూపిస్తాం
  • ఎప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో పనిచేస్తాం

అధికారం మత్తులో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తమను పెట్టిన ఇబ్బందులు మర్చిపోలేదని, అందుకే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని పట్టుదలతో గత ఎన్నికల్లో పనిచేశామని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ తీరు అర్థమయ్యాక ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వారు అధికారంలోకి రాకూడదనుకున్నామని చెప్పారు.

ఇందుకోసం అరవై మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడి సైనికుల్లా పోరాడామని చెప్పారు. పోరాడి అనుకున్నది సాధించామని, ఇప్పుడు పాలనా దక్షతతో ప్రజల్ని మెప్పిస్తామని తెలిపారు. తమకు పదవుల మీద వ్యామోహం లేదని, ముఖ్యమంత్రి అడుగు జాడల్లో ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

rachamallu sivaprasadreddy
Chandrababu
Jagan
fight for jagan
  • Loading...

More Telugu News