vijay devarakonda: మరో ఐదేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా: హీరో విజయ్ దేవరకొండ

  • 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి ఊసు లేదు
  • అంతవరకు నటనపైనే దృష్టి
  • బోరు కొడితే నటన కూడా మధ్యలో వదిలేస్తా

‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే పెళ్లి ప్రస్తావన లేదని, మరో ఐదేళ్ల తర్వాతే దాని గురించి ఆలోచిస్తానని చెప్పారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టానని, 35 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపారు. సినిమాల్లో కూడా బోరు కొట్టనన్నాళ్లే కొనసాగుతానని చెప్పారు. సినిమాకు మించి ఆసక్తికరంగా చేసేది ఏమైనా ఉందని అనిపించినా, చేసిందే చేస్తున్నానని నాకు అనిపించినా ఆ క్షణమే సినిమాలకు కూడా గుడ్‌ బై చెప్పేస్తానన్నారు.

చర్చనీయాంశంగా మారిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోని ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ సెట్‌లో అందరి ముందు ఇటువంటి సీన్స్‌లో నటించాలంటే కొంత ఇబ్బందేనన్నారు. అటువంటి పరిస్థితుల్లో హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ సౌకర్యవంతంగా ఫీలైతేనే సీన్‌ పండుతుందని చెప్పారు. ఎటువంటి సన్నివేశమైనా నటులు ఇబ్బంది పడినా పర్వాలేదని, ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదని చమత్కరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News