Jagan: తూ.గో.జిల్లా ఎస్పీ నయీమ్ కు ఫోన్ చేసి అభినందించిన వైఎస్ జగన్!

  • జషిత్ తిరిగి రావడం ఆనందాన్ని కలిగించింది
  • పోలీసులకు నా అభినందనలు
  • తూర్పు గోదావరి ఎస్పీతో జగన్

తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం నాడు కిడ్నాప్ నకు గురైన నాలుగేళ్ల చిన్నారి జషిత్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ నయీమ్ కు స్వయంగా ఫోన్ చేసిన ఆయన, కిడ్నాపర్లను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. జషిత్ కిడ్నాప్ అయిన తరువాత కేసు వివరాలను అడిగి తెలుసుకున్న జగన్, బాలుడిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని కోరిన సంగతి తెలిసిందే. బాలుడు తిరిగి వచ్చాడని తెలుసుకున్న జగన్, జిల్లా యంత్రాంగాన్ని, ఇతర సిబ్బందిని అభినందించారు.

Jagan
East Godavari District
Jashit
SP Nayeem
  • Loading...

More Telugu News