Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలపై జగన్ సర్కారు దృష్టి!
- కసరత్తు ప్రారంభించిన జగన్ ప్రభుత్వం
- ఇప్పటికే 50 పట్టణాలు ఎంపిక
- 31లోగా వివరాలు పంపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీ అంతటా 50 పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు అందాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 31లోగా ఈ పట్టణాల స్థాయి పెంపుపై, అలాగే సమీప ప్రాంతాల్లోని గ్రామాలు, ప్రాంతాల వివరాలను పంపాలని కోరినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదిత మున్సిపాలిటీల జాబితాను 13 జిల్లాల కలెక్టర్లకు మున్సిపల్ మంత్రిత్వశాఖ పంపింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.