Hyderabad: కట్టు తప్పిన భర్త... బడితె పూజచేసి బుద్ధి చెప్పిన భార్య!

  • పెళ్లయిన కొన్ని రోజులకే మరొకరితో సహజీవనం
  • విడాకులు కోరినా ఇవ్వకుండా తిప్పుతున్న వైనం
  • బంధువులతో వెళ్లి దాడి

మహిళ కాళిక అవతారం ఎత్తితే ప్రభావం ఎలా ఉంటుందో అతనికి తెలిసి వచ్చింది. పురుషాహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేకాదు, తానుండగా మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు బడితె పూజ చేసి గట్టిగా బుద్ధి చెప్పిందామె.

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ శివారు కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్న వ్యక్తిని ఓ మహిళ బంధువులతో కలిసి వచ్చి చితకబాదింది. ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన స్థానికులు విషయమేంటని ఆరాతీస్తే విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. ప్రగతినగర్లో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇదివరకే పెళ్లయింది. పెళ్లయిన కొన్ని రోజులకే ఆమెను వదిలేసి మరో మహిళతో ప్రగతినగర్లో సహజీవనం మొదలుపెట్టాడు.

భర్త తీరుతో విసిగిపోయిన ఆ మహిళ విడాకులు ఇవ్వమని కోరింది. అందుకూ ఆ ప్రబుద్ధుడు నిరాకరించాడు. ఎప్పటికీ వ్యవహారం తేలకపోవడంతో విసిగిపోయిన మహిళ బంధువులతో కలిసి ప్రగతినగర్‌ వచ్చి సదరు వ్యక్తిని చితకబాది వెళ్లిపోయింది. 

Hyderabad
pragathinagar
wife beaten husbend
illegal issue
  • Loading...

More Telugu News