swimmer: ‘బంగారు చేప’ ఫెల్ప్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లై రికార్డును బద్దలుగొట్టిన 19 ఏళ్ల కుర్రాడు!
- ఒలింపిక్‌లో 23సార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఫెల్ప్స్
- 200 మీటర్ల దూరాన్ని 1:50.73 సెకన్లలోనే చేరుకున్న క్రిస్టోఫ్
- గౌరవంగా భావిస్తున్నానన్న హంగేరియన్
ఒలింపిక్ ఈతకొలనులో 23సార్లు బంగారు పతకాలను కొల్లగొట్టిన ‘బంగారు చేప’ మైఖేల్ ఫెల్ప్స్ సృష్టించిన ప్రపంచ రికార్డును 19 ఏళ్ల హంగేరీ కుర్రాడు బద్దలుగొట్టాడు. ఫెల్ప్స్ 2009లో బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని 1:51.51 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును 19 ఏళ్ల హంగేరియన్ క్రిస్టోఫ్ మిలక్ బద్దలుగొట్టాడు.
దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జరిగిన ఫినా వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో క్రిస్టోఫ్ ఈ ఘనత సాధించాడు. పురుషుల బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని కేవలం 1:50.73 సెకన్లలోనే చేరుకున్నాడు. దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ రికార్డును బద్దలుగొట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా క్రిస్టోఫ్ పేర్కొన్నాడు.