Jashit: రోజూ ఇడ్లీలు పెట్టారు... కిడ్నాపర్లలో ఒకడి పేరు రాజు: జషిత్

  • నాలుగు రోజుల క్రితం కిడ్నాప్
  • ఈ ఉదయం కనిపించిన జషిత్
  • కేసును వేగంగా తేలుస్తామన్న పోలీసులు

తనను కిడ్నాప్ చేసిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసునని మండపేటలో కిడ్నాప్ అయి, ఈ తెల్లవారుజామున కుతుకులూరులో స్థానికులకు కనిపించిన నాలుగేళ్ల బాలుడు జషిత్ చెప్పాడు. తనను తీసుకెళ్లిన వారు రోజూ ఇడ్లీలను మాత్రమే పెట్టారని వచ్చీరాని మాటలతో చెప్పాడు. తనను తీసుకెళ్లిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసునని, అతనే తనను కారులో వదిలిపెట్టి వెళ్లాడని అన్నాడు.

 రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెప్పాడు. వారు తనను కొట్టలేదని అన్నాడు. కిడ్నాప్ చేసిన తరువాత వేరే ఊరికి తీసుకెళ్లి, ఓ వ్యక్తి ఇంట్లో వదిలేశారని చెప్పాడు. జషిత్ క్షేమంగా రావడంతో, ఈ కేసును మరింత వేగంగా దర్యాఫ్తు చేస్తామని, నిందితులను పట్టుకు తీరుతామని పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.

Jashit
Kidnap
Raju
Police
East Godavari District
  • Loading...

More Telugu News