Chinese video blogger: లైవ్‌లో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చూస్తుండగానే మృతి చెందిన బ్లాగర్

  • ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రమాదకరమైన సాహసకృత్యం 
  • విషపూరిత జెర్రిలు, బల్లులు, పురుగులు తిన్న బ్లాగర్
  • షాక్‌కు గురైన ఫాలోవర్లు

ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన ఓ వీడియో బ్లాగర్ అందరూ చూస్తుండగానే కన్నుమూశాడు. తూర్పు చైనాలోని హెఫేయికి చెందిన 35 ఏళ్ల చైనీస్ వీడియో బ్లాగర్ ‘సన్’ తన ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు చేసిన ఫీట్ అతడి ప్రాణాలను తీసింది. వీడియో బ్లాగ్ లైవ్‌లోకి వచ్చిన అతడు అందరూ చూస్తుండగా విషపూరిత జెర్రిలు, బల్లులు, మీల్‌‌వార్మ్స్, వెనిగర్, గుడ్లు తీసుకుని అనంతరం మద్యం తాగాడు.

15 వేల మంది ఫాలోవర్లను కలిగిన సన్ ‘స్టమక్ చర్నింగ్ చాలెంజ్’ (కడుపు నింపే సవాలు)తో లైవ్‌లోకి వచ్చాడు. ఓ ప్లేటులో జెర్రిలు, మరో ప్లేటులో పురుగులు, ఇంకో ప్లేటులో బల్లులు ఇలా.. అన్నీ తీసుకొచ్చిన సన్.. లైవ్‌లో వాటిని తినేసి ఆ తర్వాత మద్యం తీసుకున్నాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి చేరుకుని కుప్పకూలాడు. దీంతో షాక్‌కు గురైన గాళ్ ఫ్రెండ్ అతడి గదిలోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Chinese video blogger
centipedes
geckos
mealworms
alcohol
  • Loading...

More Telugu News