Bigboss: బిగ్‌బాస్‌లో ఎక్కడా నా పేరు వాడటానికి వీల్లేదు: కౌశల్ వార్నింగ్

  • నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 3
  • సీజన్‌ 2లో విన్నర్‌గా నిలిచిన కౌశల్
  • శ్రీముఖి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఖాతా

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 3 రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. అందరికీ బాగా తెలిసిన కంటెస్టెంట్లతో ఈసారి బిగ్‌బాస్ ఆకట్టుకుంటోంది. నాగ్ హోస్టింగ్ అనగానే ఈ షోకి చాలా క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 1, 2లతో పోలిస్తే సీజన్ 3కి మరింత ఆదరణ కనిపిస్తోంది.

ఇదిలావుంచితే, సీజన్ 2 విజేత కౌశల్ ఈ షోపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన పేరును ఎక్కడా వాడటానికి వీల్లేదని హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. బిగ్‌బాస్‌ 3లో పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ కౌశల్‌ ఆర్మీ అన్న పేరును వాడుకోవద్దని సూటిగా వార్నింగ్ ఇచ్చాడు. సీజన్ 2 దాదాపు ముప్పావు వంతు పూర్తయ్యాక కౌశల్ ఆర్మీ అనేది ఏర్పడి కౌశల్‌కి అండగా నిలుస్తూ ప్రేక్షకుల సపోర్ట్‌ను కోరింది. కానీ సీజన్ 3 ప్రారంభంలోనే శ్రీముఖి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచిన కొందరు, నెటిజన్ల సపోర్ట్‌ను కోరుతుండటం విశేషం.

  • Loading...

More Telugu News