Andhra Pradesh: చంద్రబాబు తన సంతకాన్ని తానే అమలు చేసుకోలేకపోయారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • బాబు పాలనలో వీధికో బెల్టు షాపు ఉండేది
  • చంద్రబాబు మద్యం పాలసీ వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోయాయి
  •  బాబును మహిళలు క్షమించరు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై ఆమె మాట్లాడుతూ, బెల్టు షాపులను రద్దు చేస్తామన్న హామీతో నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తాను చేసిన సంతకాన్ని తానే అమలు చేసుకోలేకపోయారని విమర్శించారు. బాబు పాలనలో వీధికో బెల్టు షాపు ఉండేదని, 'నారా వారి పాలన కాదు సారా వారి పాలన' అన్నట్టు ఆయన పాలించారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మద్యం పాలసీ వల్ల గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. బాబు పాలనలో విశాఖ బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని చూస్తే, సంస్కృతిని నాశనం చేయొద్దని తాము ఎదురు తిరిగామని గుర్తుచేశారు. బెల్టు షాపుల రద్దుపై తన తొలి సంతకాన్ని అమలు చేయలేకపోయిన చంద్రబాబును మహిళలు క్షమించరని అన్నారు. 

Andhra Pradesh
assembly
YSRCP
mla roja
  • Loading...

More Telugu News