Mission Kakatiya: తెలంగాణ సాగునీటి శాఖకు అంతర్జాతీయ గుర్తింపు

  • బాలిలో జరగనున్న సదస్సుకు ఆహ్వానం
  • ఆహ్వానం పలికిన ఇంటర్నేషనల్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ
  • మూడు అంశాలపై ప్రసంగించనున్న ఇంజినీర్ల బృందం

తెలంగాణ సాగునీటి శాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ ఆహ్వానం పలికింది. నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే ఆధ్వర్యంలోని ఇంజినీర్ల బృందం ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న సదస్సులో పాల్గొననుంది. ఈ సదస్సులో మిషన్ కాకతీయ, చిన్ననీటి వనరుల పునరుద్ధరణ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలపై ఇంజినీర్ల బృందం ప్రసంగించనుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News