assembly: ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నా..నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా మాట్లాడతా: వైసీపీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి

  • బాబులా మేమూ తయారవుతామేమోనని భయంగా ఉంది
  • జగన్ తప్పు చేయకపోయినా ఎన్నో బాధలు పడ్డారు
  • అలాంటి బాధలు శత్రువుకు కూడా వద్దు

బిల్లులపై చర్చలో భాగంగా  ఏపీ అసెంబ్లీలో ఈరోజు నిర్వహించిన సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి పాల్గొన్నారు. జగన్ పడ్డ కష్టాలను తాను దగ్గరుండి చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. జగన్ తప్పు చేయకపోయినా ఎన్ని బాధలు పడ్డారంటే, అలాంటి బాధలు శత్రువుకు కూడా వద్దని అన్నారు.

 అసెంబ్లీకి కొత్తగా వచ్చామని, చంద్రబాబును చూసి తాము కూడా ఆయనలా తయారవుతామేమోనని భయంగా ఉందనడంతో సభలో నవ్వులు విరిసాయి. అసెంబ్లీలో మాట్లాడటం తనకు ఇదే ఫస్ట్ టైమ్ అని, నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా మాట్లాడతానని అన్నారు. మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, ‘ఫస్ట్ టైమే ఇంత మాట్లాడావయ్యా, నెక్స్ట్ టైమ్ అయితే ఏం మాట్లాడతావో’ అని వ్యాఖ్యానించడంతో అధికారపక్ష నేత జగన్ సహా వైసీపీ సభ్యులు నవ్వులు చిందించారు.

assembly
YSRCP
mla
madhusudhan
speaker
  • Loading...

More Telugu News