america: ‘అమెరికాను కనుగొన్నది వాస్కోడామా’ అన్న వైసీపీ ఎమ్మెల్యే.. సభలో నవ్వులు!

  • అసెంబ్లీ  సమావేశాల్లో పాల్గొన్న మధుసూదనరెడ్డి
  • చంద్రబాబును విమర్శించే క్రమంలో ‘అమెరికా’ ప్రస్తావన
  • స్పీకర్ సహా నవ్వులు చిందించిన సభ్యులు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమెరికా గురించి ప్రస్తావిస్తూ ఆయన పొరపాటు పడ్డారు. అమెరికాను కనుగొన్నది ‘వాస్కోడామా’ అని అనడంతో, పక్కనే ఉన్న సభ్యులు ‘వాస్కోడిగామా’ అని చెప్పారు.

అయితే, అమెరికాను కనుగొన్నది వాస్కోడిగామా కాదు కొలంబస్ అన్న విషయం మధుసూదనరెడ్డికే కాదు, ఆయన పక్కనే ఉన్న సభ్యులకు కూడా తెలిసినట్టు లేదు. మధుసూదన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు స్పీకర్ సహా ఇతర సభ్యులు నవ్వులు చిందించడం గమనార్హం. అనంతరం, మధుసూదన్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తన లాంటి కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలు కావడం చాలా సంతోషంగా ఉందని, జగన్ రుణం తీర్చుకోలేమని, ’చాలా మందికి లైఫ్ ఇచ్చిన అన్న చల్లంగా ఉండాలి’ అని  అన్నారు.

america
vasco de gama
coloumbus
YSRCP
mla
  • Loading...

More Telugu News