Governer: ఏపీ నూతన గవర్నర్ కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • నా తరపున, జనసేన శ్రేణుల తరపున శుభాకాంక్షలు
  • ఏపీకి గవర్నర్‌గా రావడం శుభపరిణామం
  • ఏపీకి హరిచందన్ అండగా ఉంటారని ప్రజల ఆశ 

ఏపీ నూతన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తన తరపున, జనసేన శ్రేణుల తరపున బిశ్వభూషణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న హరిచందన్‌ కొత్త రూపు సంతరించుకున్న ఏపీకి గవర్నర్‌గా రావడం శుభపరిణామం అని అన్నారు.

అభివృద్ధి లేమి, నిధుల కొరత, అసంపూర్తిగా మిగిలిపోయిన విభజన హామీలతో సతమతమవుతున్న ఏపీకి హరిచందన్ అండగా ఉంటారని ప్రజలు ఆశతో ఉన్నారని అన్నారు. జ్ఞాన సంపన్నుడు,రాజకీయ యోధుడైన హరిచందన్ గవర్నర్ పదవికి మరింత వన్నె తీసుకువస్తారని ఆశిస్తున్నానని ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  

Governer
harichandan
Pawan Kalyan
AP
  • Loading...

More Telugu News