cocacola: మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన ‘కోకాకోలా’ కంపెనీ.. కొత్త డ్రింక్ ఆవిష్కరణ!

  • జపాన్ లో లాంచ్ చేయనున్న కోకాకోలా
  • ఆల్కహాల్ శాతం 3-7 శాతం ఉండేలా జాగ్రత్తలు
  • వివరాలు ప్రకటించిన కంపెనీ ప్రతినిధి స్కాట్

ప్రఖ్యాత శీతల పానీయాల కంపెనీ ‘కోకాకోలా’ మద్యం వ్యాపారంపై దృష్టి సారించింది. ఈ మార్కెట్ లో వాటా దక్కించుకునేందుకు వీలుగా సరికొత్త డ్రింక్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు జపాన్ ను వేదికగా ఎంచుకుంది. ఈ ఏడాది అక్టోబర్ లో ‘లెమన్ ఫ్లేవర్ తో కూడిన ఆల్కహాలిక్ సాఫ్ట్ డ్రింక్’ను జపాన్ మార్కెట్ లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తిని జపాన్ లోని క్యూషూ నగరంలో 2018, మే నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించామని కోకాకోలా అధికార ప్రతినిధి స్కాట్ లిత్ తెలిపారు.

తమ మద్యం ఉత్పత్తుల్లో ఆల్కహాలిక్ శాతం 3 నుంచి 7 శాతం వరకూ ఉంటుందని వెల్లడించారు. ఇతర సాఫ్ట్ డ్రింక్స్ తరహాలో ఓ చిన్న క్యాన్ లో మద్యం లభ్యమవుతుందని పేర్కొన్నారు. 350 మిల్లీలీటర్ల సామర్థ్యమున్న ఒక్కో చిన్న బాటిల్ రూ.103(1.5 అమెరికన్ డాలర్ల)కు అమ్మాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఈ ఉత్పత్తులు మిగతా దేశాల మార్కెట్లకు చేరుకోవడానికి మరికొంత సమయం పడుడుతుందని స్కాట్ తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News