Andhra Pradesh: ఉద్యోగ కల్పన గురించి వ్యాపారాలు మూసేసే వెర్రి వెంగలప్పలకు ఏం తెలుస్తుంది?: కేశినేనికి పీవీపీ కౌంటర్

  • ఏపీ సీఎం జగన్ ను విమర్శించిన కేశినేని
  • కేశినేని వ్యాఖ్యలను తిప్పికొట్టిన పొట్లూరి
  • ఏపీలో స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలని వ్యాఖ్య

స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డ సంగతి తెలిసిందే. జగన్ చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలాగా మారిందని ఎద్దేవా చేశారు. తాజాగా కేశినేని విమర్శలను వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ తిప్పికొట్టారు. అసలు జాబులు పీకేసే దుర్మార్గులకు, వ్యాపారాలు మూసేసే వెర్రి వెంగలప్పలకు ఉద్యోగాల కల్పన గురించి ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు.

‘‘సొల్లు పుచ్చకాయ్.. ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వారిలో సాంకేతిక రంగాల్లో పనిచేసేవారు ఎక్కువ ఉంటారు. సీఎం జగన్ గారి  ప్రభుత్వం చేసిన చట్టంలో, స్థానిక పరిశ్రమలలో అక్కడ ఉన్న స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పారు. నీ చచ్చు లాజిక్ ప్రకారం ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే ప్రపంచం అంతా ఇండియాను బహిష్కరిస్తుందా?’’ అని సెటైర్లు వేశారు.

Andhra Pradesh
YSRCP
pvp
Telugudesam
Kesineni Nani
Twitter
counter
  • Loading...

More Telugu News