Rahul Gandhi: కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంపై ఘాటుగా స్పందించిన రాహుల్ గాంధీ

  • విశ్వాస పరీక్షలో ఓడిన కుమారస్వామి సర్కారు
  •  దురాశ గెలిచిందన్న రాహుల్
  • సంకీర్ణంపై తొలి రోజు నుంచే కుట్రలు మొదలయ్యాయన్న కాంగ్రెస్ నేత

కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఇంతకాలం మౌనంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మొత్తానికి ఈ రోజు దురాశ గెలిచిందని ఘాటుగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇంటాబయట చిక్కులు మొదలయ్యాయన్నారు. తమ అధికారానికి సంకీర్ణ ప్రభుత్వం అడ్డొస్తుందన్న దుగ్ధతో కుట్రలు చేసి మొత్తానికి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు నేడు వారి దురాశ గెలిచిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం, నిజాయతీ, కర్ణాటక ప్రజలు ఓడిపోయారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కారు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా సమర్పించారు.

Rahul Gandhi
Karnataka
kumaraswamy
Congress
BJP
  • Loading...

More Telugu News