Mumbai: మళ్లీ ముంచెత్తిన వర్షం.. జలమయమైన ముంబై

  • మూడు గంటల వ్యవధిలోనే 51 మి.మీ వర్షం
  • రోడ్దు కనిపించక ఢీకొన్న మూడు కార్లు
  • ముంబైకి ఈరోజు కూడా వర్ష సూచన

ముంబై మహా నగరంపై వరుణుడు మరోసారి పంజా విసిరాడు. నిన్న రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లు సరిగా కనిపించక అంధేరి ప్రాంతంలో మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, సియాన్ రైల్వే స్టేషన్ లో పట్టాలు నీటమునిగాయి. దీంతో, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

రాత్రి 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు ఏకంగా 51 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటే ముంబై పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రోజు ముంబైలో కురిసే సాధారణ వర్షపాతం కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. మరోవైపు, ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Mumbai
Heavy Rains
  • Loading...

More Telugu News