ED: ఈడీ మాజీ అధికారి శ్రీనివాస్ గాంధీపై మనీ లాండరింగ్ కేసు నమోదు

  • రాజకీయ నాయకుడికి సాయం చేసి భారీగా లబ్ధిపొందిన గాంధీ
  • రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఈడీ
  • త్వరలోనే ఆస్తుల అటాచ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అధికారి శ్రీనివాస్ గాంధీపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు గాంధీపై కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈసీఐఆర్‌లో పేర్కొంది. ఈ నెల 8న గాంధీపై సీబీఐ అక్రమాస్తుల కేసును నమోదు చేసింది.

 సీబీఐ కేసు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై దాడులు చేసింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. ఏపీ, హైదరాబాద్‌లలో శ్రీనివాస్ గాంధీ భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆయన అక్రమాస్తులను అటాచ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు.

ఓ రాజకీయ నాయకుడి జీఎస్టీ కేసును పర్యవేక్షించిన శ్రీనివాస్ గాంధీ ఆయనకు అనుకూలంగా వ్యవహరించి భారీగా లబ్ధిపొందినట్టు ఆరోపణలున్నాయి. 2010 నుంచి గాంధీ ఈడీలో పనిచేస్తూ వచ్చారు. 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019లో ఏకంగా రూ.3.74 కోట్లకు పెరిగాయి.

  • Loading...

More Telugu News