Telangana: మంచిర్యాలలో విద్యార్థుల దారుణం: సెలవు కోసం తోటి విద్యార్థినిపై హత్యాయత్నం!

  • చెన్నూరు కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఘటన
  • బాధిత విద్యార్థిని కేకలు వేయడంతో బెడిసికొట్టిన ప్లాన్
  • మందలించి ఇంటికి పంపిన ప్రిన్సిపాల్

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూలుకు సెలవుల కోసం తోటి విద్యార్థినిని హత్య చేసేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించడం సంచలనమైంది. జిల్లాలోని చెన్నూరులో ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ముగ్గురు సెలవుల కోసం వక్ర బుద్ధితో ఆలోచించారు. ఎవరైనా విద్యార్థినిని చంపేస్తే స్కూలుకు సెలవులు వస్తాయని భావించారు. ఇందుకోసం రమాదేవి అనే స్నేహితురాలిని ఎంచుకున్నారు. ముగ్గురూ కలిసి ప్లాన్ అమలు చేసే క్రమంలో రమాదేవి గట్టిగా కేకలు వేసింది. దీంతో విద్యార్థినులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విద్యార్థినులను పట్టుకుని మందలించి ఇంటికి పంపారు.

Telangana
Mancherial District
kasturba gandhi school
students
  • Loading...

More Telugu News