V. Hanumantha Rao: కాంగ్రెస్ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది వెంకటస్వామి కుటుంబమే!: వీహెచ్

  • వివేక్ బీజేపీలో చేరడాన్ని తప్పుబట్టిన వీహెచ్
  • బీజేపీలో చేరికపై తామేమీ మాట్లాడలేమని వెల్లడి
  • కాంగ్రెస్ నేతలు హాజరు కావడంపై ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది వెంకటస్వామి కుటుంబమేనని, అలాంటిది ఇప్పుడు ఆయన తనయుడు మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. నేడు ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వివేక్ బీజేపీలో చేరుతుండటంపై తామేమీ మాట్లాడలేమన్నారు. సొంత కార్యాచరణ అంటూ ఏమీ లేకుండా వివేక్ పార్టీ మారడమేంటంటూ వీహెచ్ ధ్వజమెత్తారు.  

V. Hanumantha Rao
Vivek
Venkata Swamy
Congress
Gandhi bhavan
BJP
  • Loading...

More Telugu News