Karnataka: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ అమలు

  • మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ ఓటింగ్
  • త్వరగా ప్రసంగం ముగించాలని సీఎంకు స్పష్టం చేసిన స్పీకర్
  • అవాంఛనీయ చర్యలు జరగకుండా బెంగళూరులో ఆంక్షలు

కర్ణాటక ప్రభుత్వం భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి ప్రసంగం కొనసాగుతోంది. తనకు మూడు గంటల సమయం కావాలని కుమారస్వామి కోరగా, ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు. సీఎం ప్రసంగం తర్వాత బలపరీక్ష ఓటింగ్ ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పడిపోతే అవాంఛనీయ చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. రెండు రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలుస్తోంది.

Karnataka
Assembly
Banglore
  • Loading...

More Telugu News