Chandrababu: రాజధానిలో ఒక్క వెయ్యి ఎకరాలు అమ్మకానికి పెడితే నిజమైన భూముల విలువ తెలుస్తుంది: ఐవైఆర్ కృష్ణారావు
- రాజధాని భూముల విలువపై బాబు వ్యాఖ్యల్లో నిజంలేదన్న ఐవైఆర్
- ఊహాజనిత విలువలతో గాలిమేడలు కట్టలేరంటూ విమర్శ
- ట్విట్టర్ లో స్పందించిన ఐవైఆర్
ఏపీ రాజధాని అమరావతి భూముల విలువ రూ. 2 లక్షల కోట్లు ఉంటుందని బాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. రూ. 2 లక్షల కోట్లు అనేది కేవలం ఊహాజనితమైన భూముల విలువ అని వ్యాఖ్యానించారు. రాజధానిలో భూముల వాస్తవ విలువ తెలియాలంటే ఓ వెయ్యి ఎకరాలు అమ్మకానికి పెట్టాలని ఐవైఆర్ ట్వీట్ చేశారు. ఊహాజనిత విలువలతో గాలిమేడలు కట్టలేమంటూ విమర్శించారు.
ఇక, రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం నిలిపివేతపైనా ఆయన స్పందించారు. ప్రపంచబ్యాంకు నుంచి వచ్చేది రుణమే కానీ గ్రాంటు కాదని స్పష్టం చేశారు. 12వ ఆర్థిక సంఘం తర్వాత ఈ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, అందువల్ల ఏదో కోల్పోయామనే బాధ అవసరంలేదని తన ట్వీట్ లో పేర్కొన్నారు.