Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • సభను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు
  • అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీర్మానం 
  • అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల సస్పెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో, ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీర్మానం మేరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులపై వేటు పడింది. వీరు ముగ్గురినీ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తున్నామని, వీరు వెంటనే సభను వీడి వెళ్లాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. 

Assembly
Suspend
Kinjarapu Acchamnaidu
Buchchaia chowdary
Nimmala
  • Loading...

More Telugu News