East Godavari District: విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయుడు.. కాపుకాసి కత్తితో పొడిచిన విద్యార్థి

  • అందరి ముందు అవమానిస్తున్నాడని కక్ష
  • సోమవారం అర్ధరాత్రి కాపుకాసి కత్తితో దాడి
  • పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

తనను మందలిస్తున్న ఉపాధ్యాయుడిపై పగతో రగిలిపోయిన ఓ విద్యార్థి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జరిగిందీ ఘటన. నలుగురిలో తరచూ మందలిస్తుండడంతో ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై విన్సెంట్‌ అనే విద్యార్థి కక్ష పెంచుకున్నాడు.

సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక కత్తితో ఆయనపై దాడిచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, టీచర్ తనను రోజూ అందరి ముందు అవమానిస్తుండడంతో తట్టుకోలేకే దాడికి పాల్పడినట్టు నిందితుడు విన్సెంట్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

East Godavari District
Rajol
Teacher
Student
  • Loading...

More Telugu News