Gali Janardhan reddy: నా ఆస్తుల అప్పగింతలో ఈడీ జాప్యాన్ని వీడకుంటే సుప్రీంను ఆశ్రయిస్తా: గాలి జనార్దన్‌రెడ్డి

  • ఈడీ ఎదుట విచారణకు హాజరైన జనార్దన్‌రెడ్డి
  • నా ఆస్తులను అప్పగించాలని హైకోర్టు తీర్పిచ్చింది
  • హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది

మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు.

విచారణానంతరం గాలి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను తనకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, ఈ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం సైతం సమర్థించిందన్నారు. తన ఆస్తుల విడుదలలో ఈడీ జాప్యాన్ని వీడకుంటే న్యాయం కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Gali Janardhan reddy
ED
Basheerbagh
Supreme Court
High Court
  • Loading...

More Telugu News