Narasimhan: కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

  • ఏపీ గవర్నర్ గా భిశ్వభూషణ్ నియామకం
  • నరసింహన్ కు వీడ్కోలు పలకనున్న ఏపీ ప్రభుత్వం
  • హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న నరసింహన్

గత ఐదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగిన ఈఎస్ఎల్ నరసింహన్ కు వీడ్కోలు పలికేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించడంతో నరసింహన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

ఈ నేపథ్యంలో, నరసింహన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. భక్తిభావనలు మెండుగా ఉండే ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో జ్ఞాపికలను బహూకరించారు.

Narasimhan
Governor
Andhra Pradesh
  • Loading...

More Telugu News