Chandrayaan2: చంద్రయాన్-2ను బాహుబలి అని పిలుస్తుండటంపై ప్రభాస్ స్పందన
- చంద్రయాన్-2 విజయవంతం కావడం పట్ల గర్విస్తున్నా
- దీన్ని బాహుబలి అని పిలుస్తుండటం సంతోషాన్నిస్తోంది
- భారీ ఆకారంతో సక్సెస్ ఫుల్ గా నింగిలోకి ఎగిరినందుకు ఆనందంగా ఉంది
చంద్రయాన్-2ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భారీ సైజులో ఉండే జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను అంతరిక్షంలోని మోసుకెళ్లింది. ఈ రాకెట్ భారీ సైజులో ఉండటంతో అందరూ దీన్ని ముద్దుగా 'బాహుబలి' అని పిలుస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై హీరో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
'చంద్రయాన్-2ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం పట్ల గర్విస్తున్నా. దీన్ని బాహుబలి అని పిలుస్తుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాహుబలిలాంటి భారీ ఆకారంతో సక్సెస్ ఫుల్ గా నింగిలోకి ఎగిరినందుకు ఆనందంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు' అని ప్రభాస్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.