Chiru: చిరూ, కొరటాల మూవీ ఫస్టు షెడ్యూల్ షూటింగ్ అక్కడేనట
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5bef0a8dfada745cd1a79cb4a3d3d3cfabcad6c7.jpg)
- చిరూ పుట్టినరోజున కొరటాల సినిమా లాంచ్
- కొంత గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- నవంబరులో తొలి షెడ్యూల్ షూటింగ్
చిరంజీవి 152వ సినిమాకి కొరటాల దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సైరా' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న చిరంజీవి, ఆ వెంటనే కొరటాల ప్రాజెక్టు పైకి రానున్నట్టుగా చెబుతున్నారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమాను లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించే ఆలోచనలో కొరటాల వున్నాడు.
ఈ సినిమా కథ కొంత గ్రామీణ నేపథ్యంలో సాగుతుందట. అందుకు సంబంధించిన సన్నివేశాలను 'పలాస' పరిసర ప్రాంతాల్లో జరపడానికి కొరటాల ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్ షూటింగును జరపనున్నారు. ఈ సినిమాలోను వినోదంతో పాటు సామాజిక సందేశం ఉండేలా కొరటాల చూసుకున్నాడని అంటున్నారు.