Dear commrade: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన హీరోయిన్ రష్మిక మందన

  • కాబోయే భర్త తన ఇష్టాలను చెప్పినా చెప్పకపోయినా ఫర్వాలేదు
  • నిజాయతీగా, మంచి మనసుతో ఉండాలి
  • రొమాంటిక్ గానూ ఉండాలి

హీరో విజయ్ దేవరకొండ, కన్నడ హీరోయిన్ రష్మిక మందన కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో రష్మిక చిట్ చాట్ చేసింది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని ఓ విలేకరి ప్రశ్నించగా, ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భావాలను, ఇష్టాలను చెప్పినా చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ, నిజాయతీగా మాత్రం ఉండాలని చెప్పింది. అన్నింటికన్నా మించి అతడు మంచి మనసు కలిగి ఉండాలని, అతడితో చాలా సమయం గడపాలని తనకు అనిపించాలని, రొమాంటిక్ గా ఉండాలని చెప్పిన రష్మిక, తన దృష్టిలో రొమాంటిక్ గా ఉండేందుకు వయసుతో పని లేదని చెప్పింది. ఇదిలా ఉండగా, 2017లో రష్మికకు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. అయితే, కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోవడంతో ఈ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.

Dear commrade
vijay devarakonda
Rashmika mandani
  • Loading...

More Telugu News