Puri Jagannadh: నేను బూతులు మాట్లాడటం విని పవన్ అలా అన్నాడు: పూరి జగన్నాథ్

  • మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ 
  • తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు
  •  ఆ ఆలోచన తనకి రాదంటోన్న పూరి

పూరి జగన్నాథ్ తన కథలో హీరోని మాస్ ఆడియన్స్ కి నాయకుడిగానే చూపిస్తాడు. ఆ పాత్రకి తగినట్టుగానే మాస్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇక తెలుగులోనో .. ఇంగ్లిష్ లోనో తిట్టుకునే మాటలను కూడా ఆయన తన సినిమాలకి టైటిల్స్ గా పెట్టేస్తుంటాడు. అలాంటి పూరి నుంచి తాజాగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాలోనూ మ్యూట్ చేయబడిన డైలాగ్స్ వున్నాయి.

తన సినిమాల్లో ని బూతు డైలాగ్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో పూరి ప్రస్తావిస్తూ, " నేను బూతులు ఎక్కువగా మాట్లాడేస్తూ వుంటాను. ఆ సమయంలో అవి బూతులు అనే ఆలోచన నాకు రాదు. ఒకసారి షూటింగులో పవన్ ఉండగానే నేను బూతులు మాట్లాడేశాను. అప్పుడు ఆయన 'బూతులు మాట్లాడే వాళ్లంటే నాకు ఇష్టం వుండదు. కానీ నువ్వు మాట్లాడుతుంటే బాగుంది' అన్నారు అంటూ పూరి నవ్వేశాడు.

Puri Jagannadh
Pavan
  • Loading...

More Telugu News