Crime News: శాడిస్ట్‌ భర్త... భోజనం తయారు చేయలేదని భార్య కాళ్లు, చేతులు కోసేశాడు!

  • సరుకులు తేకున్నా టైంకి తిండి పెట్టాలి
  • ఇంటి అవసరాలు పట్టించుకోడని దంపతుల మధ్య వివాదం
  • నిందితుడు ఆటో డ్రైవర్‌

కుటుంబ యజమానిగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి బలాదూర్‌గా తిరగడమేకాదు, భార్యపట్ల అమానుషంగా వ్యవహరించిన శాడిస్ట్‌ భర్త వైనమిది. భోజనం పెట్టమంటే  అన్నం వండలేదని చెప్పిందని చాకుతో భార్య కాళ్లు, చేతులు కోసేసిన దారుణం వెలుగు చూసింది.

విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతం గొల్లపాలెంగట్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కాలనీకి చెందిన అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి, హాసినికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ సంపాదన అంతా సొంత ఖర్చుకే తగలేసి ఇంటి నిర్వహణకు మాత్రం డబ్బులు సరిగా ఇవ్వడు. ఈ విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవ జరుగుతుండేది.

ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన జగదీష్‌ భోజనం పెట్టమని భార్యను కోరాడు. బియ్యం లేక వంట చేయలేదని ఆమె  చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. సమీపంలోని చాకు తీసుకుని ఆమె చేతులు, కాళ్ల మీద విచక్షణా రహితంగా కోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News
Vijayawada
man rided on wife
  • Loading...

More Telugu News