DK Shivakumar: సంకీర్ణ ప్రభుత్వం కోసం కుమారస్వామి పదవీ త్యాగానికి సిద్ధంగా ఉన్నారు: డీకే శివకుమార్

  • కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్ చివరి ప్రయత్నం చేస్తోంది
  • కాంగ్రెస్ కు సీఎం పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది
  • సిద్ధరామయ్య, పరమేశ్వర, శివకుమార్ లలో ఒకరు సీఎం కావాలని కోరుకుంటోంది

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఈరోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతోంది. అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు చిట్ట చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మాట్లాడుతూ, పదవీ త్యాగం చేసి, కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కూడా కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్ చివరి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. సిద్ధరామయ్య, జి.పరమేశ్వర, శివకుమార్ లలో ఎవరో ఒకరు సీఎం కావాలని కోరుకుంటోందని తెలిపారు. 

DK Shivakumar
Kumaraswamy
Siddaramaiah
JDS
Congress
  • Loading...

More Telugu News