PVP: భయ్యా... మొలతాడు కట్టిన మగాడివే అయితే...: కేశినేనికి పీవీపీ సవాల్

  • ఎంపీ పదవికి రాజీనామా చెయ్యి
  • ఇండిపెండెంట్ గా పోటీ చేసి 40 ఓట్లు తెచ్చుకో
  • ట్విట్టర్ లో పీవీపీ వరప్రసాద్ సవాల్

కేశినేని నాని మొనగాడే అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి, 40 ఓట్లు తెచ్చుకోవాలని విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన పీవీపీ వరప్రసాద్ సవాల్ విసిరారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, "నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు. మొనగాడివి, మొలతాడు కట్టిన మగాడివి అయితే, రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!" అని అన్నారు. అంతకుముందు "పాపం పార్టీ బండి మూల పడింది అని, దాని  తరపున పోటీ చేసి డబ్బా  కొట్టుకున్న 2 లక్షల మెజారిటీ కొంచెంలో మిస్ అయ్యానే, అని చాలా ఫీల్ అవుతున్నావంటా! అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, 4 లక్షల మెజారిటీ కొడతావేమో!! నీ బస్సులన్నీ బ్రాండ్ న్యూ కదా!" అని అన్నారు. 

PVP
Vijayawada
Twitter
Kesineni Nani
  • Error fetching data: Network response was not ok

More Telugu News