Telangana: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి తారకమ్మ కన్నుమూత!

  • వృద్ధాప్య కారణాలతో మరణం
  • తరలివస్తున్న కార్యకర్తలు, సన్నిహితులు
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తల్లి తారకమ్మ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 105 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలతో ఆమె కన్ను మూసినట్టు తెలుస్తోంది. స్వగ్రామమైన వనపర్తిలో ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి సన్నిహితులు వనపర్తిలోని ఆయన స్వగ్రామానికి చేరుకుని, తారకమ్మకు నివాళులు అర్పించారు. తమ ఇంట్లో పెద్ద దిక్కు ఆమేనని, ఆమెను కోల్పోవడం తీరని లోటని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. తారకమ్మ మృతిపై పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.

Telangana
Tarakamma
Niranjan Reddy
Passes Away
  • Loading...

More Telugu News