Kurnool District: రోడ్డుపై చావుబతుకుల్లో ఉన్న వృద్ధుడిని తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన కర్నూలు ఎమ్మెల్యే

  • హైదరాబాద్-బెంగళూరు రహదారిపై ప్రమాదం
  • రక్తపుమడుగులో వృద్ధుడు
  • వెంటనే స్పందించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

ఆపదలో ఉన్న ఓ వృద్ధుడ్ని కాపాడిన కర్నూలు టౌన్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ వృద్ధుడ్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన తీవ్రగాయాలతో చావుబతుకుల్లో పోరాడుతుండగా, అంతలో ఆ వైపుగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వచ్చారు. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి కర్నూలు వెళుతున్నారు. అయితే, రక్తపుమడుగులో పడివున్న వృద్ధుడ్ని చూసి తన వాహనం నిలిపారు. తన సిబ్బంది, అనుచరుల సాయంతో క్షతగాత్రుడ్ని తన వాహనంలో చేర్చి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయనకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రదర్శించిన మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Kurnool District
Hafeez Khan
MLA
Road Accident
  • Loading...

More Telugu News