Karnataka: సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయాం... క్షమించండి: కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు

  • సంకీర్ణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసంతృప్తులు
  • సీఎంకు విచక్షణ లేదంటూ విమర్శ
  • తమ నిర్ణయంలో మార్పులేదంటూ వెల్లడి

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ కష్టాలకు కారణమైన కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు మరోసారి తెరపైకి వచ్చారు. కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీరు సరిగాలేదని, విధాన సభలో నిబంధనలు పాటించరని, అందుకే తాము అసెంబ్లీకి హాజరుకావడంలేదని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విచక్షణ అనేదే లేదని విమర్శించారు. తమ నిర్ణయం పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు మార్చుకునేదిలేదని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయామని, ప్రజలు తమను క్షమించాలని కోరారు.

Karnataka
Congress
  • Loading...

More Telugu News