Nani: పిల్లల్ని ఎలా పెంచాలన్న హీరో నాని ప్రశ్నకు 'పులి పిల్ల' ఉదాహరణతో బదులిచ్చిన సద్గురు!

  • సద్గురు జగ్గీ వాసుదేవ్ తో నాని ప్రశ్నావళి
  • తండ్రి ఔన్నత్యం గురించి ప్రశ్నించిన నాని
  • సవివరంగా చెప్పిన సద్గురు

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తో హీరో నాని ప్రశ్నావళి కార్యక్రమం గచ్చీబౌలీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తత్వ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు నాని అడగ్గా, అద్భుతమైన ప్రాపంచిక జ్ఞానంతో కూడిన జవాబులను సద్గురు అందించారు. ఈ సందర్భంగా నాని ఓ తండ్రిగా అడుగుతున్నానంటూ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పమని కోరారు. అందుకు సద్గురు ఇలా చెప్పారు.

"ఒక పులి కడుపున పులి పిల్ల పుట్టిందంటే ఒక పులి పుట్టిందనే అర్థం. తన భవిష్యత్తుకు సంబంధించిన 90 శాతం లక్షణాలు పిల్లగా ఉన్నప్పుడే పులిలో ఉంటాయి. మిగతా 10 శాతం పెంపకం ద్వారా లభిస్తాయి. తిండి తింటే చాలు పులి పిల్ల కాస్తా పులై పోతుంది. కానీ, మనిషి అలా కాదు. ఓ శిశువు పుట్టగానే మనిషికి అవసరమైన 10 శాతం లక్షణాలే ఉంటాయి. మిగతా 90 శాతం పెంపకం ద్వారానే సంక్రమిస్తాయి. ఆ బిడ్డ మనిషి కావడం అనేది తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మకు మాత్రమే ఈ ప్రత్యేకత" అంటూ వివరణ ఇచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News